Copymaster

Thursday 5 August 2010



తెలుగు సినీ ఇండస్ట్రీలో రికార్డుల మీద రికార్డులు సృష్టించడం రాజమౌళికే చెల్లుతుంది. తనతోటి డైరెక్టర్లు హిట్లతో పాటు ప్లాప్‌లనూ చూస్తున్నా.. ఈ యంగ్ డైరెక్టర్ మాత్రం ఇంతవరకూ ఒక్క ప్లాప్‌నూ ఎదుర్కోలేదు. కారణమేమిటో తెలుసా...?
స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి అన్ని సినిమాలు దాదాపు హిట్‌లుగానో.. బంపర్‌హిట్‌లుగానో అంచనాలను అందుకున్నాయి. తాజాగా తీసిన మర్యాదరామన్న కూడా కలెక్షన్ల విషయంలో నిర్మాతలకు లాభాలనే తెచ్చిపెట్టింది.
ఖర్చు కాస్త ఎక్కువ పెడతాడని రాజమౌళికి పేరున్నప్పటికీ, విజయాల పరంగా చూస్తే నిర్మాతల డైరెక్టర్‌గానే పేరు తెచ్చుకున్నాడు. ఖర్చుకు మించిన లాభాలు వస్తాయి కాబట్టి, రాజమౌళితో సినిమాకు భారీ నిర్మాతలంతా సిద్ధంగానే ఉంటారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. అసలు విషయం మాత్రం వేరు.
సినిమా తీసే విషయంలో రాజమౌళిది క్రియేటివ్ బుర్రే అయినప్పటికీ.. కథ విషయంలో మాత్రం పక్కా కాపీ మాస్టరే. హాలీవుడ్ సినిమాలను కాపీకొట్టి, మనకు తగ్గట్లుగా తీయడంలో రాజమౌళిని మించిన వారు లేరనే చెప్పాలి. పెద్ద సినిమాలకు ఏదో కాపీ కొట్టాడులే అనుకుంటే.. చివరకు మర్యాదరామన్న కూడా కాపీ సినిమానే అని బయటపడేసరికి నేనైతే విస్తుపోయా. "అవర్ హాస్పిటాలిటీ" అనే ఇంగ్లీష్ సినిమాతో పాటు.. "బలగాలు మాలగెట్టి మాలవలయ బ" (గడపదాడితే) అనే కన్నడ సినిమానూ కలగలిపి వండి వార్చి మర్యాదరామన్నగా తీర్చిదిద్దాడు మన కాపీడైరెక్టర్ రాజమౌళి. మరీ ఇంత దౌర్భాగ్యమా..

ఇక ఇప్పుడు మహేశ్‌బాబుతో కొత్త సినిమాకు సిద్ధమయ్యాడు రాజమౌళి. పెద్ద హీరోలతో వరసగా సినిమాలు చేస్తుండడం.. మహేశ్‌బాబుకు ఉన్న ఇమేజ్‌తో పోల్చితే.. ఎంత భారీ సినిమా తీస్తాడో అన్న అభిప్రాయం సినీ ప్రేక్షకులది. అయితే.. ఏ సినిమాను కాపీ కొడతాడో అన్న అనుమానం నాది. కచ్చితంగా సొంతస్టోరీతో మాత్రం రాజమౌళి తీసే ఛాన్సే లేదు. ఆ కాపీ సినిమా ఏంటి.. మహేశ్ సినిమా స్టోరీ ఏమిటన్నది త్వరలోనే బయటపడడం మాత్రం ఖాయం.

Posts Relacionados

No comments:

Post a Comment